జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం వారాంతపు కూరగాయల సంత జరుగుతుంది. ఈ సందర్భంగా నేడు సంతలో బిహార్ కు చెందిన ఓ వ్యక్తి కూరగాయలు తీసుకుంటున్న ఓ వినియోగదారుని నుంచి సెల్ ఫోన్ చోరీ చేస్తుండగా గమనించిన స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతనిని పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ప్రతి వారం సంతలో దొంగల బెడద ఎక్కువైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.