మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బి. ఆర్ డిగ్రీ కళాశాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ. డిగ్రీ చదువుతూ అనేక ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాన్ని కూడా పెంచుకోవాలని సూచించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ కల్పనలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడించారు.