జడ్చర్లలో సరస్వతినగర్ కాలనీలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన ఎమ్మెల్యే జునుంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శుక్రవారం సరస్వతినగర్ లోని విద్యుత్ అధికారులు ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మాణ పనులు చేపట్టారు.