జడ్చర్ల పట్టణంలోని ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 3 నెలలు బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, వార్డు కౌన్సిలర్ సతీష్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. బ్యూటీషియన్ కోర్సులో నైపుణ్యత పెంచుకొని, స్వయం ఉపాధి పొంది కుటుంబాలకు అండగా ఉండాలన్నారు.