కరెంట్ షాక్ తగిలి ఓ మేస్త్రి మృతిచెందిన ఘటన జడ్చర్లలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. కావేరమ్మపేటకు చెందిన కొత్తగొల్ల వెంకటయ్య (55) టైల్స్ మేస్త్రిగా పనిచేస్తున్నారు. గోపులాపూర్ కు చెందిన ఓ ఇంట్లో టైల్స్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కి గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.