ఓ మెకానికల్ ఇంజనీరింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జడ్చర్ల నియోజకవర్గంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం కాకర్ణాల గ్రామంలోని మనోహర్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కృష్ణా జిల్లా మంటాడకు చెందిన మెకానికల్ ఇంజనీర్ కాశి పూర్ణచందర్ రావు(43) కంపెనీ కేటాయించిన గదిలో మృతి చెందాడు. మృతుడి భార్య దీప్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.