మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. విషయం తెలుసుకునిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, డ్రైనేజీలు, మోరీలు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రజలు, వాహనదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.