జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో కల్వకుర్తి నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న లారీ, కారును ఓవర్ టేక్ చేయబోయి రెండు వాహనాలు ఆదివారం సాయంత్రం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొంత మేరకు కారు ధ్వంసం అయ్యింది. లారీ డ్రైవర్, కారు ఓనర్ ఇరువురు వాగ్వాదానికి దిగారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు ఇరువురికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.