మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం రుద్రారంకు చెందిన విద్యార్థి గొల్ల శ్రీశైలం 153 మార్కులతో ఏపీ ఈ సెట్ ఫలితాలను జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. ఇందులో స్టేట్ 3వ ర్యాంకు సాధించాడు. దీంతో గ్రామస్థులు, విద్యాభిమానులు విద్యార్థినిని అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినిని గ్రామస్తులు ఆకాంక్షించారు.