జడ్చర్ల: కలెక్టర్ చదివిన పాఠశాల.. నేడు ఇలా..!

50చూసినవారు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ లోని 44 వ జాతీయ రహదారి సమీపంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఇది. ఇదే పాఠశాలలో టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి తన పాఠశాల విద్యను ఇక్కడే విద్యనభ్యసించారు. ఘన కీర్తి కలిగిన ఈ పాఠశాలను మరో ప్రాంతానికి మార్చడంతో పాఠశాల ఖాళీగా ఉంది. చెత్తా చెదారంతో నిండిపోయింది. వినియోగంలోకి తెచ్చి, ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి మార్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్