జడ్చర్ల: చెరువులో పడి ఇద్దరు గల్లంతు

81చూసినవారు
చెరువులో పడి ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జడ్చర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. బాలానగర్ మండలం గంగాధర్ పల్లికి చెందిన శివరాములు (45) చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లి మునిగిపోయాడు. శివ రాములును కాపాడేందుకు యాదయ్య (25) చెరువులోకి దిగగా ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ లెనిన్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. చీకటి పడటంతో సహాయక చర్యలు నిలిపివేయగా మంగళవారం ప్రారంభిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్