జడ్చర్ల: నూతన రేషన్ కార్డు వివరాల పరిశీలన

55చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం కంచన్ పల్లి బోయిన్ పల్లి తదితర గ్రామాల్లో నూతనంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల రేషన్ కార్డుల వివరాలను మండల గిర్దావార్ అంబిక శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల గ్యాస్ బిల్, ఆధార్ కార్డ్, తదితర అంశాలను పరిశీలన చేసి యాప్ లో సబ్మిషన్ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, మండల, గ్రామ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్