మహబూబ్ నగర్ జిల్లా & రూరల్ మండలం అల్లీపూర్ గ్రామంలో జైబాపు. జై భీమ్. జై సంవిధాన్ పాదయాత్ర సోమవారం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీతో వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్య పరిచారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబెద్దుల్లా కొత్వాల్ మాట్లాడారు. భారత రాజ్యాంగ రక్షణకు ప్రజలు, కార్యకర్తలు అండగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందివ్వడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు.