జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పలుగు మీది తండా కు చెందిన బాలు నాయక్ నిర్మల దంపతుల కూతురు భానుప్రియ శనివారం వెలువడిన నీట్ ఫలితాలలో 490 మార్కులు సాధించింది. భానుప్రియ తండ్రి బాలు నాయక్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కూతురును చదివించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన భానుప్రియ జాతీయ స్థాయిలో రాణించడంతో ఆదివారం తండా వాసులు, బంధువులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు.