జడ్చర్ల: గల్లెంతయిన వారి కోసం గాలింపు

85చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం గంగాధర్ పల్లిలో చేపలు పట్టేందుకు వెళ్లి రాములు, యాదయ్యలు సోమవారం గల్లంతైన విషయం తెలిసిందే. ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మంగళవారం ఫైర్, ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా చెరువులలోకి గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు కూడా గల్లంతయిన వారి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్