జడ్చర్ల మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకుల సమావేశం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ మంగళవారం నిర్వహించడం జరిగింది. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు, కొల్లూరు మండలంతో పాటు, జడ్చర్ల రూరల్, అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేయాలని, రూరల్ పోలీస్ స్టేషన్ కు సొంత భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.