అన్ని దానాల కంటే రక్తదానమే మహా దానం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ఏనుగొండ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏనుగొండలోని ఆంజనేయ స్వామి ఆవరణలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. మహనీయుని జయంతి రోజున రక్తదానం శిబిరం నిర్వహించామన్నారు.