మహబూబ్ నగర్ జిల్లాలోని పాలకొండ శివారులో ఉన్న తిరుమలనాథ స్వామి దేవాలయం తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకుంటున్నారు. తొలి ఏకాదశి నాడు స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే ప్రగాఢ నమ్మకం భక్తులలో ఉంది.