మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని 6వ వార్డు శ్రీనివాస కాలనీ ప్రాంతంలో ఒక కుక్క గత కొద్ది నెలలుగా ఒక పందుల గుంపుతో సంచరిస్తోంది. ఆ పందులు కూడా ఈ కుక్కను తమతో కలుపుకుని కలియదిరుగుతున్నాయి. వీటిని గత కొద్ది రోజులుగా గమనిస్తున్న ప్రజలు మాత్రం మనుషుల మధ్య ఎన్నో ఇబ్బందులు, సమస్యలు వస్తున్నాయి. కానీ జాతి భేదం మరిచి. పందులతో శునకం స్నేహం చేయడం, మూగజీవాలు ఇలా నడుచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు.