తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు ఉన్న సంతోషం కంటే ఈ రోజు ఈఏపీ సెట్లో ర్యాంకులు సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను చూస్తుంటే మరింత సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విద్యార్థులను గురువారం జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నాం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.