మహబూబ్ నగర్ నియోజకవర్గం పరిధిలోని దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.