మల్లు రవికి ఘన సత్కారం

59చూసినవారు
నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కోత్వాల్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుంచి మల్లు రవి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్