జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లోకిరేపు గ్రామంలో మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి గ్రామ పెద్ద చెరువు నిండింది. దీంతో బుధవారం గ్రామస్తులు గంగాదేవికి, కట్ట మైసమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. చెరువు నిండడంతో మూడు పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.