పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వరి పంట కోత దశలో ఉండటంతో వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిస్తే తమకు కన్నీళ్లే మిగులుతాయి అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా పాలమూరు జిల్లా కేంద్రంలో ఆకాశం మేఘావృతమై ఉంది.