రూ. 68 లక్షల విలువగల నల్ల బెల్లం పట్టివేత

83చూసినవారు
రూ. 68 లక్షల విలువగల నల్ల బెల్లం పట్టివేత
హైదరాబాద్ నుంచి జడ్చర్ల మీదుగా తెలకపల్లి గ్రామానికి నల్లబెల్లంను లారీలో తరలిస్తున్నారని సమాచారం మేరకు గురువారం జడ్చర్ల ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. 21 టన్నులకు పైగా నల్లబెల్లం, 20 కేజీల పట్టిక, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని కాట్రావత్ శీనును అరెస్టు చేశామని అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సుమారు దీని విలువ రూ. 68 లక్షల పైగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్