బాలానగర్ లో వీధి కుక్కలు స్వెర విహారం

71చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. కుక్కల బెడదతో చిన్నపిల్లలు, వృద్ధులు భయపడుతున్నారు. రోడ్లపై కుక్కలు విచ్చలవిడిగా ఉండడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతి అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి కుక్కలను నివారించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్