గౌడ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆదివారం మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో ప్యారడైస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గౌరవ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులను ఆయన అభినందించారు.