మహబూబ్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని 25వ వార్డు, గోల్ మజీద్ ప్రాంతంలో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులతో నిర్మించనున్న బాక్స్ డ్రైనేజీ నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోల్ మజీద్ నుంచి రైస్ మజీద్ వరకు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మాణ చేస్తున్నామని తెలిపారు.