మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం గార్ధిర్యాల్ కు చెందిన ఆంజనేయులు మూడేళ్లుగా (ప్రభుత్వ సెలవు మినహా) ఏ ఒక్క రోజుగా సెలవు పెట్టకుండా విధులకు హాజరవుతూ నిరంతరం విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారు. బాధ్యతగల టీచర్ గా కుమారులను ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. విజిట్ కు వచ్చిన నోడల్ అధికారి పాఠశాల రికార్డును పరిశీలించి ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం జడ్పీ హై స్కూల్ పుట్టపహాడ్ లో హెచ్ఎం గా పనిచేస్తున్నారు.