మాదకద్రవ్య రహిత జిల్లాగా మహబూబ్ నగర్ ను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరే కార్యాలయంలో ఎస్పిడి జానకి, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ గట్టి నిఘా ఉంచాలన్నారు. మాదకద్రవ్యాలు వినియోగించకుండా కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.