రైలు ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని యువతి అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా. వెంటనే స్పందించిన పోలీసులకు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా. ఆత్మహత్యాయత్నమా.? అనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.