కల్వకుర్తిలో కురుస్తున్న భారీ వర్షం

84చూసినవారు
కల్వకుర్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో శుక్రవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి మేఘావృతమై ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. రైతులకు కొంత ఆనందం కలిగించినప్పటికీ కూడా ఈ భారీ వర్షాలతో వేసిన వేరుశనగ విత్తనాలు బయటికి వస్తాయా లేదా అని ఆందోళన ఉన్నట్టుంది.

సంబంధిత పోస్ట్