కల్వకుర్తి: కళ్యాణ లక్ష్మి పథకంతో పేదలకు మేలు

80చూసినవారు
కల్వకుర్తి: కళ్యాణ లక్ష్మి పథకంతో పేదలకు మేలు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లులో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్