కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన కౌన్సిలర్ శానవాస్ ఖాన్ సహోదరుడు ఫిరోజ్ ఖాన్ (47) గురువారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పి లేవడంతో కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు హుటాహుటిన హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ వైద్యం చేస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.