కల్వకుర్తిలో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం

58చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై మాజీ మంత్రి కేటీఆర్ అక్కసు వెల్లగక్కుతున్నారని కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పాలమూర్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు డిస్కో డాన్సులు, క్యాబరే డాన్సులు చేయాలి అనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్