నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గేటు సమీపంలోని హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని పడమటి తండాకు చెందిన రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసుకుని ఆటోలో తిరిగి వస్తున్నారు. వెల్దండ సమీపంలోకి రాగానే కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.