కొల్లాపూర్ మండల కేంద్రంలో ఆదివారం వయనాడు వరద బాధితులకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి విరాళాలు రూ.5, 451 రూపాయలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల కేరళ రాష్ట్రం వయనాడులో కొండ చర్యలు విరిగిపడి బండరాళ్లతో కూడిన వరదలతో సుమారు 300 మందికి పైగా మరణించడం చాలా ఘోర ప్రమాదం అని అన్నారు.