గద్వాల: మరో మూడు రోజులు వర్షాలు

78చూసినవారు
గద్వాల: మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే ఛాన్స్‌ ఉందని చెప్పింది. బుధవారం మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడుతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్