నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు ఉన్నతమైన విద్య, పేద ప్రజలకు ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రత్నగిరి ఫౌండేషన్ కృషి చేయాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలను వైద్య సదుపాయాలను వివరించి చైతన్యవంతం చేయాలని సూచించారు.