కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను బుధవారం రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ సందర్శించారు. దుకాణాలలో ఉన్న స్టాక్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ఎరువులు, విత్తనాల కొనుగోళ్ల విషయంలో రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.