పద్మశ్రీ గ్రహీతలకు రూ. 25లక్షల చెక్కుల పంపిణీ: మంత్రి జూపల్లి

78చూసినవారు
పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చెక్కును బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందించారు. పద్మశ్రీ గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్ సీఎం చేతుల మీదుగా చెక్కులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్