బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, పాడి పంటలు, వ్యాపారాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు మహబూబ్ నగర్ పార్టీ నేతలు పాల్గొన్నారు.