మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన డోనూరు అనన్య రెడ్డి (IAS) మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు పేదవారి బాధలు దగ్గర్నుంచి చూశాను. బాధ్యత మరింత సక్రమంగా నిర్వహిస్తామని అనన్య రెడ్డి తెలిపారు. జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.