అలంపూర్ నియోజకవర్గం మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గురువారం నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త మహిళా విద్య అభివృద్ధికై మార్గదర్శి, లింగ వివక్ష, జాతి వివక్షత లేని సమాజ స్థాపనకు పరితపించి జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుడికి జోహార్ జోహార్ అని కొనియాడారు.