మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పట్టణంలో పలు కాలనీల్లో వాన పడింది. గడియారం చౌరస్తాలో భారీ వర్షం కారణంగా ఒక చెట్టు విరిగి పడింది. న్యూటౌన్, మెట్టుగడ్డ తదితర ప్రాంతాలలో తుంపర వాన పడింది. బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది.