జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా 08542- 241165 కు సమాచారం అందిస్తే అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపలు పట్టడం, వాగులను దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు.