కొత్తపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ బిజెపిలో చేరిక

53చూసినవారు
కొత్తపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ బిజెపిలో చేరిక
మహబూబ్ నగర్ జిల్లా అయోధ్య నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, మిడ్జిల్ మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేశమానికి శంకరయ్య ముదిరాజ్ బుధవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారికి డీకే కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్