మహబూబ్‌నగర్‌: 2బీ బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

70చూసినవారు
మహబూబ్‌నగర్‌: 2బీ బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ 28 (2బి) బార్లకు దరఖాస్తుల ఆహ్వానం బుధవారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24, మహబూబ్‌నగర్‌, బోధన్‌, నిజామాబాద్‌, సరూర్‌నగర్‌, జల్‌పల్లి మునిసిపాలిటీల్లో ఒక్కొక్క బార్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో లైసెన్స్ పొంది కానీ ఫీజులు చెల్లించనందున రద్దైన 28 బార్లకు ఈ పునరుద్ధరణ చర్య చేపట్టారు. దరఖాస్తు రుసుం రూ. 1 లక్ష. జూన్ 6 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్