మహబూబ్ నగర్: ఈ నెల 2 నుంచి తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నగర, పురపాలికల్లో పారిశుద్ధ్య విభాగాలు నిర్వహిస్తున్నాయి. ఇళ్ల నుంచి చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, సీజనల్ వ్యాధులపై అవగాహన, మురుగు కాల్వల శుభ్రం, వీధి కుక్కల నియంత్రణ తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని బ్యానర్లు పట్టుకొని సంఘాల మహిళలతో ర్యాలీ శనివారం తీశారు. వీధుల్లో ఇంటింటికి వెళ్లి యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు.