మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులు చదువుతున్న తీరును, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం డార్మెటరీలు, కిచెన్ రూమ్ ను పరిశీలించారు. టాయిలెట్లను గురించి ఆరాతీశారు. మరుగుదొడ్లులో గాలి వెళ్లేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.